Nitish Kumar Reddy Wicket Video: నితీష్ కుమార్ రెడ్డి గోల్డెన్ డక్ వీడియో ఇదిగో, స్కాట్ బోలాండ్ వేసిన డెలివరీకి స్టీవ్ స్మిత్‌కు దొరికిన ఆల్‌రౌండర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ రోజు మ్యాచ్‌లో రిషభ్ పంత్ 40 పరుగులతో మనోడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ రోజు మ్యాచ్‌లో రిషభ్ పంత్ 40 పరుగులతో మనోడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా 26 పరుగులు, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 22 పరుగులు, శుభ్‌మన్ గిల్ 20 పరుగులు, విరాట్ కోహ్లీ 17 పరుగులు, యశస్వి జైస్వాల్ 10 పరుగులు చేశారు.కేఎల్ రాహుల్ నాలుగు పరుగులు, ప్రముఖ్ కృష్ణ మూడు పరుగులు, మహ్మద్ సిరాజ్ మూడు పరుగులు చేశారు. నితీష్ రెడ్డి ఖాతా తెరవలేకపోయారు. ఆస్ట్రేలియా తరఫున స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్ రెండు వికెట్లు తీయగా, నాథన్ లియాన్ ఒక వికెట్ తీశాడు. వరుసగా విఫలమవుతున్న రోహిత్‌పై విశ్రాంతి పేరుతో టీమ్‌మేనేజ్‌మెంట్ వేటు వేయడంతో ఏస్ పేస్ బౌలర్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
Nitish Kumar Reddy Wicket Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)