'Do You Want to Marry Me': టీవీ కెమెరాల ముందే నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్లేయర్‌కి ప్రపోజ్ చేసిన కోచ్, వెంటనే ఒకే చెప్పిన ప్లేయర్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
నన్ను పెళ్లి చేసుకుంటావా అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకొని నిల్చున్నాడు.కోచ్ సడెన్‌గా అలా చేయడం చూసి పెరెజ్ ఆశ్చర్యపోయింది.
టోక్యో ఒలింపిక్స్‌లో ఓ కోచ్ ఫెన్సింగ్ ప్లేయర్‌కు టీవీ కెమెరాల ముందే నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్జెంటీనా ఫెన్సర్ మారియా బెలెన్ పెరెజ్ మారిస్ అనే ఆ ప్లేయర్ లైవ్‌లో మాట్లాడుతుండగా ఆమె కోచ్ లూకాస్ సాసెడో ఆమె వెనుక నుంచి.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకొని నిల్చున్నాడు.కోచ్ సడెన్‌గా అలా చేయడం చూసి పెరెజ్ ఆశ్చర్యపోయింది.
చాలా మంది మనల్ని చూస్తున్నారు.. ఎస్ అని చెప్పు అని కోచ్ మోకాలిపై కూర్చొని వేడుకున్నాడు. దీంతో ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. 2010లోనూ పారిస్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్స్ సందర్భంగా ఇలాగే కెమెరా ముందు ఆమెకు ప్రపోజ్ చేశాడు. కానీ జోక్ చేస్తున్నావా అంటూ ఆమె లైట్ తీసుకోవడంతో అతడు నిరాశ చెందాడు. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మళ్లీ అలాగే చేసి సక్సెస్ అయ్యాడు. ఈ ఇద్దరూ ఏకంగా 17 ఏళ్ల నుంచీ రిలేషన్‌షిప్‌లో ఉండటం విశేషం. సాసెడోకు ఎస్ చెప్పిన తర్వాత ఆమె సంతోషం పట్టలేక ఏడ్చేసింది. అర్జెంటీనా వెళ్లిన తర్వాత తాము సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పింది.
ప్రపోజ్ చేస్తున్న వీడియో
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)