Paris Olympics 2024: రెండు పతకాలతో పారిస్ నుంచి భారత్‌లో అడుగుపెట్టిన షూటర్ మను బాకర్, ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన వీడియో ఇదిగో..
ఇవాళ ఉదయం కోచ్ జస్పాల్ రాణా (Jaspal Rana)తో కలిసి దేశరాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi airport) ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా షూటర్‌కు ఘన స్వాగతం లభించింది.
పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో సంచలనం సృష్టించిన షూటర్ (shooter) మను బాకర్ (Manu Bhaker) భారత్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం కోచ్ జస్పాల్ రాణా (Jaspal Rana)తో కలిసి దేశరాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi airport) ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా షూటర్‌కు ఘన స్వాగతం లభించింది. మను బాకర్ హ్యాట్రిక్ మెడల్ మిస్, 25మీ పిస్తోల్ ఈవెంట్‌లో నాలుగో స్థానం, రెండు కాంస్యాలతో బాకర్ రికార్డు
ఒలింపిక్స్ క్రీడల్లో మను బాకర్ రెండు పతకాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రెండు సార్లూ కాంస్య పతకాన్ని ముద్దాడింది. అయితే, ఈ విశ్వ క్రీడల్లో హ్యాట్రిక్ మెడల్స్ కొట్టే అవకాశాన్ని మను చేజార్చుకుంది. ఈవెంట్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న ఆ షూటర్.. 25మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లో తృటిలో కాంస్య పతకాన్ని మిస్ చేసుకుంది. దీంతో రెండు పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)