Paris Olympics 2024: వీడియో ఇదిగో, అమ్మా..నేను బంగారు పతకంతో తిరిగివస్తా, తల్లికి మాట ఇచ్చిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్
గోల్డ్ మెడల్ తీసుకువస్తా అని వినేశ్ తన తల్లికి మాట ఇచ్చింది. సెమీస్ విజయం తర్వాత వినేష్ వీడియో కాల్‌లో తన తల్లితో మాట్లాడారు. ఈ సమయంలో వినేష్ తన కుటుంబ సభ్యులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. భావోద్వేగానికి గురైంది.
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో మంగళవారం జరిగిన సెమీస్‌లో 5-0 తేడాతో క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపేజ్‌ను వినేశ్ చిత్తు చేసింది.మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో టోక్యో కాంస్య విజేత, అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్‌తో వినేశ్ ఫొగాట్ తలపడుతుంది. గతేదాడి జరిగిన అవమానాన్ని పంటికింద బిగపట్టి దేశం కోసం అద్భుత ప్రదర్శన, పారిస్ ఒలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్
ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 11.23 గంటలకు జరగనుంది. స్వర్ణ పతకమే లక్ష్యంగా వినేశ్ బరిలోకి దిగుతోంది. గోల్డ్ మెడల్ తీసుకువస్తా అని వినేశ్ తన తల్లికి మాట ఇచ్చింది. సెమీస్ విజయం తర్వాత వినేష్ వీడియో కాల్‌లో తన తల్లితో మాట్లాడారు. ఈ సమయంలో వినేష్ తన కుటుంబ సభ్యులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. భావోద్వేగానికి గురైంది. వీడియో చివర్లో ‘గోల్డ్ లానా హై’ (నేను బంగారం తెస్తా) అని తన తల్లితో అన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)