Tamil Nadu: పెళ్లి జంటకు కానుకగా లీటర్ పెట్రోల్, డీజిల్, పెట్రో ధరలు మండిపోతున్న వేళ స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోయిన నూతన వధూవరులు
ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులకు వారి స్నేహితులు లీటర్ పెట్రోల్, డీజిల్ బహుమతిగా ఇచ్చారు. పెట్రో ధరలు మండిపోతున్న వేళ వారిచ్చిన గిఫ్ట్ అందరినీ ఆశ్చర్యపరించిది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులకు వారి స్నేహితులు లీటర్ పెట్రోల్, డీజిల్ బహుమతిగా ఇచ్చారు. పెట్రో ధరలు మండిపోతున్న వేళ వారిచ్చిన గిఫ్ట్ అందరినీ ఆశ్చర్యపరించిది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.తమిళనాడులోని చంగల్‌పట్టు జిల్లా చెయ్యూరులో గిరీశ్ కుమార్, కీర్తన జంట వివాహ వేడుక జరుగుతున్నది. అంతా వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. వారి స్నేహితులు ఓ కవర్‌లో నుంచి రెండు లీటర్ బాటిళ్లు తీశారు.. పెట్రోల్, డీజిల్‌తో ఉన్న ఆ బాటిళ్లను ఇద్దరి చేతిలో పెట్టి వారిని సర్‌ప్రైజ్ చేశారు. గతంలో కూడా ఓ వివాహ వేడుకలో నూతన జంటకు పెట్రోల్ డబ్బాతోపాటు సిలిండర్, ఉలిగడ్డలు బహుమతిగా ఇచ్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)