Ravindra Jadeja Retires: టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మిగతా ఫార్మాట్లలో కొనసాగుతానని ప్రకటన
టీ20 క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. జడ్డూ మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) కొనసాగుతానని స్పష్టం చేశాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్, భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. జడ్డూ మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) కొనసాగుతానని స్పష్టం చేశాడు. టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్...బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం...
పొట్టి ప్రపంచకప్ గెలవడంతో తన కల నిజమైందని అన్నాడు. టీ20 కెరీర్‌లో వరల్డ్‌కప్ గెలవడం అత్యుత్తమమని తెలిపాడు. కెరీర్‌లో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలని పేర్కొన్నాడు. చివరిగా జై హింద్ అని రాసుకొచ్చాడు. 35 ఏళ్ల రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20ల్లో 74 మ్యాచ్‌లు ఆడి 127.2 స్టయిక్‌రేట్‌తో 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికాతో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కు ఇది రెండో ప్రపంచకప్.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)