Tamil Nadu: షాకింగ్ వీడియో, బోర్డు వద్ద రాడ్‌ను పట్టుకుని వేలాడుతూ బస్సు నుంచి కిందపడిపోయిన విద్యార్థి, సోషల్ మీడియాలో వీడియో వైరల్

తమిళనాడులోని మేల్మరువత్తూరులో ఓ బస్సు నుంచి విద్యార్థి పడిపోయిన వీడియో వైరల్ గా మారింది. బస్సులో నిండా ప్రయాణికులు ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఫుట్ బోర్డు వద్ద రాడ్ ను పట్టుకుని నిలబడ్డారు. ఖాళీగా ఉన్న రోడ్డులో బస్సు వేగంగా దూసుకెళ్తోంది.

Standing crowded Bus near door student fell down

తమిళనాడులోని మేల్మరువత్తూరులో ఓ బస్సు నుంచి విద్యార్థి పడిపోయిన వీడియో వైరల్ గా మారింది. బస్సులో నిండా ప్రయాణికులు ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఫుట్ బోర్డు వద్ద రాడ్ ను పట్టుకుని నిలబడ్డారు. ఖాళీగా ఉన్న రోడ్డులో బస్సు వేగంగా దూసుకెళ్తోంది.ఈ క్రమంలో సుమారు పన్నెండు, పదమూడేళ్ల విద్యార్థి పట్టుతప్పి పడిపోయాడు. అదీ బస్సు వెనుక చక్రం పక్కనే పడ్డాడు. బస్సు మాత్రం ముందుకు వెళ్లిపోయింది. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది.ఒకవేళ ఆ విద్యార్థి కాస్త ముందు పడి ఉంటే.. చాలా తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement