WWE Event: సెప్టెంబర్ 8న హైదరాబాద్ లో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్.. ఒక్క రోజులో టికెట్లు ఖాళీ

ప్రపంచంలోనే ఎంతో పాప్యులర్ అయిన ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్’ (డబ్ల్యూడబ్ల్యూఈ) మొదటిసారి హైదరాబాద్ లో జరగబోతోంది. ఈ పోటీలకు సంబంధించిన టికెట్లను బుక్ మై షో అందుబాటులోకి తీసుకురాగా, ఒక్క రోజులోనే అన్నీ అయిపోయాయి.

Credits: X

Hyderabad, Aug 20: ప్రపంచంలోనే ఎంతో పాప్యులర్ అయిన ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్’ (డబ్ల్యూడబ్ల్యూఈ) (WWE) మొదటిసారి హైదరాబాద్ (Hyderabad) లో జరగబోతోంది. ఈ పోటీలకు సంబంధించిన టికెట్లను బుక్ మై షో (Book My Show) అందుబాటులోకి తీసుకురాగా, ఒక్క రోజులోనే అన్నీ అయిపోయాయి. రూ.12,000, రూ.15,000 ధరల టికెట్లన్నీ అయిపోగా.. రూ.5,000, రూ.7,500 టికెట్ కేటగిరీల్లో బుకింగ్ లు ముగింపునకు వచ్చేశాయి. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 8న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియప్ రియా రిప్లే, సమీ జ్యాయన్, కెవిన్ఓనర్ తదితర రెజ్లింగ్ స్టార్లు రాబోతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement