Assigning Duty To Dead Employee: గవర్నర్ పర్యటన సందర్భంగా చనిపోయిన ఉద్యోగికి డ్యూటీ.. క్లర్క్ సస్పెండ్.. యూపీలో ఘటన

(Assigning Duty To Dead Employee) ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక క్లర్క్‌ (Clerk) ను సస్పెండ్ (Suspend) చేశారు. ఉత్తరప్రదేశ్‌ లో ఈ సంఘటన జరిగింది.

Dead Body. (Photo Credits: Pixabay)

Lucknow, Dec 25: గవర్నర్ పర్యటన సందర్భంగా చనిపోయిన ఉద్యోగికి డ్యూటీ వేశారు. (Assigning Duty To Dead Employee) ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక క్లర్క్‌ (Clerk) ను సస్పెండ్ (Suspend) చేశారు. ఉత్తరప్రదేశ్‌ లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 26న ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆనందీబెన్ పటేల్ బల్లియాను సందర్శించారు. జననాయక్ చంద్రశేఖర్ యూనివర్శిటీ ఐదవ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అయితే గవర్నర్ ఆనందీబెన్ పటేల్ బల్లియా పర్యటన సందర్భంగా చనిపోయిన ఒక ఉద్యోగికి డ్యూటీ కేటాయించారు. దీంతో గవర్నర్‌కు వడ్డించే ఆహారాన్ని పరీక్షించే బాధ్యత ఎవరూ చూడలేదు. కాగా, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. బల్లియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలో పనిచేస్తున్న క్లర్క్, ఘటనకు బాధ్యుడు బ్రిజేష్ కుమార్‌ ను శనివారం సస్పెండ్ చేశారు.

Humanbody Wireless Charger: శరీరంలో అమర్చే వైర్‌ లెస్‌ చార్జర్‌ అభివృద్ధి.. నిర్ణీత వ్యవధి తర్వాత శరీరంలో కలిసిపోయే మెడికల్‌ ఇంప్లాంట్