Lucknow Shocker: లక్నోలో దారుణం, రోడ్డు పక్కన నిలబడిన అక్కాతమ్ముడుపై యాసిడ్ దాడి, సీసీటీవీ ఫుటేజీ వైరల్
యూపీలోని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ విసిరిన ఘటనలో 21 ఏళ్ల మహిళ, ఆమె తమ్ముడు గాయపడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. చౌక్ స్టేడియం సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఈ ఘటన జరిగిందని తెలిపారు
యూపీలోని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ విసిరిన ఘటనలో 21 ఏళ్ల మహిళ, ఆమె తమ్ముడు గాయపడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. చౌక్ స్టేడియం సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఈ ఘటన జరిగిందని తెలిపారు. రోడ్డు పక్కన తన సోదరుడితో కలిసి నిలబడి ఉన్న మహిళపై, ఆమె కజిన్ సోదరుడిపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశారని అదనపు పోలీసు కమిషనర్ (ACP) దుర్గేష్ కుమార్ తెలిపారు. ఆవుపై అత్యాచారం చేసిన యవకుడు, గతంలోనూ రేప్ కేసుల్లో రెండుసార్లు జైలుకెళ్లిన వ్యక్తి, ఇప్పుడు ఆవును రేప్ చేసి అరెస్ట్
క్షతగాత్రులను కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీలోని ట్రామా సెంటర్‌కు తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు.నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని, సమీప ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఏసీపీ కుమార్ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో యాసిడ్ దాడి బాధితురాలిని సోదరుడు ఓదార్చేందుకు ప్రయత్నించగా నొప్పితో మెలికలు తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)