Sachin on Vinesh Phogat Disqualification: వినేశ్‌ ఫొగాట్‌ రజత పతకానికి అర్హురాలే, భారత్ రెజ్లర్‌కు బాసటగా నిలిచిన సచిన్ టెండూల్కర్

దీనిపై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (CAS) విచారణ జరపనున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. వినేశ్‌ ఫొగాట్‌ రజత పతకానికి అర్హురాలేనన్నారు

Sachin on Vinesh Phogat Disqualification

ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ ఫైనల్స్‌కు చేరిన వినేశ్‌ ఫొగాట్‌ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (CAS) విచారణ జరపనున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. వినేశ్‌ ఫొగాట్‌ రజత పతకానికి అర్హురాలేనన్నారు. అంపైర్‌ తీర్పునకు సమయం ఆసన్నమైందన్న ఆయన.. వినేశ్‌కు రజత పతకం వస్తుందని ఆశిద్దామంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.ప్రతి ఆటలోనూ నియమాలుంటాయి. వాటిని సందర్భోచితంగా చూడాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు సహేతుక కారణం కనిపించకపోవడంతోపాటు క్రీడా స్ఫూర్తి లోపించినట్లే’’ అని సచిన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘నాపై రెజ్లింగ్‌ గెలిచింది.. నేను ఓడిపోయా..’ కుస్తీకి వినేశ్‌ ఫోగాట్‌ గుడ్‌ బై.. సిల్వర్ మెడల్ పై తీర్పు రాకముందే సంచలన నిర్ణయం తీసుకున్న భారత స్టార్‌ రెజ్లర్‌

Here's Sachin Tweet