Viral Video: కన్నీరు పెట్టిస్తున్న వీడియో, యజమాని అంత్యక్రియలు చేస్తున్నారని శ్మశానానికి పరిగెత్తుకొచ్చిన లేగ దూడ, యజమాని ముఖాన్ని నాకి కన్నీరు కార్చిన వైనం

సోషల్ మీడియాలో ఓ వీడియో కన్నీరు పెట్టిస్తోంది. జార్ఖండ్‌లో హజారీబాగ్‌ ప్రాంతానికి చెందిన ఓ పశువుల యజమాని చనిపోవడంతో అంత్యక్రియలు జరిపేందుకు బంధువులు, స్నేహితులు మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు.

Calf Runs To Cemetery To Say Goodbye To Dead Owner (Photo-Video Grab)

సోషల్ మీడియాలో ఓ వీడియో కన్నీరు పెట్టిస్తోంది. జార్ఖండ్‌లో హజారీబాగ్‌ ప్రాంతానికి చెందిన ఓ పశువుల యజమాని చనిపోవడంతో అంత్యక్రియలు జరిపేందుకు బంధువులు, స్నేహితులు మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు జరిపేందుకు రెడీ అవుతుండగా చనిపోయిన వ్యక్తికి చెందిన పశువుల్లోని ఒక దూడ పరుగు పరుగున శ్మశానవాటికకు వచ్చింది. తన యజమానిని వెతక్కుంటూ ఆ మృతదేహం వద్దకు వెళ్లి యజమాని ముఖాన్ని నాకి కన్నీరు కార్చింది. అంతేగాక అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నది. ఒక యూజర్‌ ట్విట్టర్‌లో గురువారం పోస్ట్‌ చేసిన ఈ హృదయవిదారక వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement