Viral Video: ఢిల్లీలో జాతీయ జెండాకు ఘోర అవమానం, స్కూటీని జాతీయ జెండాతో తుడిచిన దాని యజమాని, అతన్ని అరెస్ట్ చేసి స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
దీన్ని చుట్టుపక్కలవారు వీడియో చిత్రీకరించి సోషల్‌మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో ఆన్‌లైన్ లో వైరల్ అయింది.
ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో ఓ వ్యక్తి జాతీయ జెండాతో తన స్కూటీని తుడుస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.ఉత్తర ఘోండా ప్రాంతంలో నివసించే ఓ 52 ఏళ్ల వ్యక్తి తన వైట్ స్కూటీని మడతపెట్టిన జాతీయ జెండాతో శుభ్రం చేస్తూ, దుమ్ము దులుపుతూ కనిపించాడు. దీన్ని చుట్టుపక్కలవారు వీడియో చిత్రీకరించి సోషల్‌మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో ఆన్‌లైన్ లో వైరల్ అయింది. ఈ వీడియో ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లడంతో సదరు వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యక్తి ఉపయోగించిన జాతీయ జెండా, స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)