Jaquar Viral Video: ‘వాట్‌ ఏ పవర్‌’.. ఈ వీడియోను చూశాక, మీరు కూడా అలాగే అంటారు. పొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకిన చిరుత..

పొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకిన చిరుత..

New Delhi, August 19: నీటిలో మొసలికి ఉన్నంత బలం మరే జీవికి ఉండదంటారు. అయితే, ఈ వీడియో అందుకు భిన్నం. ఓ జాగ్వార్‌(చిరుతపులి) నదిలోకి దూకి మొసలిని వేటాడి ఆహారంగా మలుచుకుంది. ముందుగా చెట్టు పొదల్లో నక్కిన చిరుతపులి మెల్లగా నది ఒడ్డుకు వచ్చింది. తర్వాత  నీటిలో తేలియాడుతున్న మొసలిపై ఒక్క ఉదుటున దూకి భయంకరంగా దాడి చేసింది. వెంటనే దాని దవడలతో మొసలి మెడ భాగంలో కరిచి పట్టుకొని నది నుంచి బయటకు లాక్కెళ్లింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘ఓ దేవుడా జాగ్వార్‌కు ఎంత శక్తి ఉంది. వాట్ ఏ పవర్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement