Asian Games 2023: ఆసియా క్రీడల్లో కొనసాగుతున్న భారత్ జయభేరి.. షూటింగ్ లో మన ఆటగాళ్ల ప్రపంచ రికార్డు.. ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమరి, స్వప్నిల్ కుసాలే, అఖిల్ షెరాన్ కు బంగారు పతకాలు
ఆసియా క్రీడల్లో భారత్ జయభేరి కొనసాగుతుంది. షూటింగ్ లో మన ఆటగాళ్లు ప్రపంచ రికార్డు సాధించారు.
Newdelhi, Sep 29: ఆసియా క్రీడల్లో భారత్ జయభేరి కొనసాగుతుంది. షూటింగ్ లో మన ఆటగాళ్లు ప్రపంచ రికార్డు సాధించారు. ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమరి (Aishwary Pratap Singh) (591 పాయింట్లు ), స్వప్నిల్ కుసాలే (Swapnil Kusale) (591 పాయింట్లు), అఖిల్ షెరాన్ (Akhil Sheoran) (587 పాయింట్లు) బంగారు పతకాలు గెలుచుకున్నారు. ముగ్గురు ఆటగాళ్ళు కలిసి 50మీటర్ల రైఫిల్ 3పీ ఈవెంట్ లో మొత్తంగా 1769 పాయింట్లు సాధించారు. ఇది ప్రపంచ రికార్డు. గతంలో ఈ రికార్డు అమెరికా పేరిట 1761 పాయింట్లతో ఉండేది. ఈ విభాగంలో చైనాకు సిల్వర్ మెడల్ రాగా, కొరియా కాంస్యాన్ని సాధించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)