Ben Stokes Retirement: వన్డేలకు గుడ్ బై చెప్పిన బెన్ స్టోక్స్, మంగళవారం జరగనున్న వన్డే తనకు చివరిదని ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ అలియాస్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోమవారం సాయంత్రం అతడు ఓ ప్రకటనను విడుదల చేశాడు. మంగళవారం జరగనున్న వన్డే తనకు చివరిదని అతడు ప్రకటించాడు.
వన్డేలకు మరో స్టార్ ప్లేయర్ సోమవారం గుడ్‌బై చెప్పాడు. ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ అలియాస్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోమవారం సాయంత్రం అతడు ఓ ప్రకటనను విడుదల చేశాడు. మంగళవారం జరగనున్న వన్డే తనకు చివరిదని అతడు ప్రకటించాడు. వన్డేలకు వీడ్కోలు పలకనున్న స్టోక్స్ టెస్టు క్రికెట్‌లో కొనసాగనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుతో ఆ దేశ జట్టు ఆడిన మూడు సిరీస్‌లలో బెన్ స్టోక్స్ పాలుపంచుకున్నాడు. టీమిండియాతో వన్డే సిరీస్ ముగిసిన మరునాడే అతడు వన్డే క్రికెట్‌కు గుడ్‌బై పలుకుతూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
న్యూజిల్యాండ్‌లో జన్మించిన బెన్ స్టోక్స్ కుటుంబంతో కలిసి చిన్నతనంలోనే ఇంగ్లండ్ వలస వెళ్లాడు. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌లో క్రికెట్ పాఠాలు నేర్చుకున్న స్టోక్స్ ఆ దేశ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. బ్యాటర్‌గానే కాకుండా బౌలర్‌గానూ రాణించిన స్టోక్స్ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించాడు. ప్రస్తుతం 31 ఏళ్ల వయసున్న స్టోక్స్... ఇంగ్లండ్ జట్టుకు 83 టెస్టులు, 101 వన్డేలు ఆడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ మెరిసిన స్టోక్స్...రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో అతడు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. వన్డేలకు గుడ్ బై చెప్పిన టెస్టు క్రికెట్‌లో మరింత కాలం కొనసాగనున్నాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)