Ravi Shastri: వన్డేలు చచ్చిపోతున్నాయి, 50 నుంచి 40 ఓవర్లకు మార్చాల్సిందే, ఐసీసీ ఇకనైనా మేల్కొనకపోతే వన్డే ఫార్మాట్‌ ముగిసిపోతుందని తెలిపిన రవిశాస్త్రి

వన్డేలు 50 ఓవర్ల పాటు సాగుతుండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారని.. ఈ ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాల్సిన సమయం ఉందని, లేకపోతే వన్డే క్రికెట్‌ అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు.

Ravi Shastri (Photo credit: Twitter)

వన్డే ఫార్మాట్‌పై టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డేలు 50 ఓవర్ల పాటు సాగుతుండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారని.. ఈ ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాల్సిన సమయం ఉందని, లేకపోతే వన్డే క్రికెట్‌ అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు. గతంలో 60 ఓవర్లుగా సాగే వన్డే ఫార్మాట్‌ను 50 ఓవర్లకు కుదించిన విషయాన్ని గుర్తు చేశాడు. దీంతో పాటు చాలామంది క్రికెటర్ల వన్డేలకు గుడ్‌బై చెబుతున్నందున ఈ మార్పుపై ఐసీసీ దృష్టి సారించాలని కోరాడు.

50 ఓవర్ల పాటు ఆట సాగడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలవడంతో పాటు ఆటగాళ్లు తీవ్ర అలసటకు లోనై ఒత్తిడికి గురవుతున్నారని అన్నాడు. ఈ విషయంలో ఐసీసీ ఇకనైనా మేల్కొనకపోతే వన్డే ఫార్మాట్‌ చచ్చిపోతుందని తెలిపాడు. ఇదే విషయాన్ని పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కూడా ప్రతిపాదించాడు. మరోవైపు వసీమ్‌ అక్రమ్‌ లాంటి దిగ్గజ ఆల్‌రౌండర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూల్‌లో నుంచి వన్డే ఫార్మాట్‌ను తొలగించాలని వాదిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)