Glenn Maxwell Hospitalised: పీకల దాగా తాగి పబ్‌లోనే సోయలేకుండా పడిన గ్లెన్ మాక్స్‌వెల్, అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు, ఘటనపై విచారణ ప్రారంభించిన క్రికెట్ ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఫుల్‌గా తాగి ఆసుపత్రి పాలయ్యాడు.పీకల దాగా తాగిన మాక్స్‌వెల్ పబ్‌లోనే సోయలేకుండా పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిని రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా సీరీయస్‌గా తీసుకుంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ ప్రారంభించింది.

కాగా జనవరి 19న ఆసీస్ క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్న ‘‘సిక్స్ అండ్ అవుట్’’ బ్యాండ్ అడిలైడ్‌లో ఓ కాన్సర్ట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అనుమతి లేకుండానే మాక్స్‌వెల్ పాల్గోన్నాడు. అక్కడే పుల్లుగా తాగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ప్రకటించిన ఆసీస్ జట్టులో మాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు. విండీస్‌తో టీ20ల దృష్ట్యా అతడికి విశ్రాంతి ఇచ్చారు. అంతే తప్ప అతడిని జట్టు నుంచి తప్పించడానికి పబ్ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది.
Here's News