ICC T20 World Cup 2024 Prize Money: టీ20 వరల్డ్‌కప్‌ 2024 గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 20.36 కోట్లు ప్రైజ్‌మనీ, రన్నరప్‌కు రూ. 10.64 కోట్లు, ప్రైజ్‌మనీ వివరాలను ప్రకటించిన ఐసీసీ

టీ20 వరల్డ్‌కప్‌ 2024 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ వెల్లడించింది. మెగా టోర్నీలో పాల్గొనే 20 జట్లకు ఓవరాల్‌గా రూ. 93.52 కోట్లను ఐసీసీ పారితోషికంగా పంచనుంది. టోర్నీ విజేతకు ప్రపంచకప్‌ ట్రోఫీతో పాటు రూ. 20.36 కోట్లు.. రన్నరప్‌కు రూ. 10.64 కోట్లు లభించనున్నాయి.

ICC T20 World Cup 2024 Trophy (Photo Credits: @All_about_kp/X)

టీ20 వరల్డ్‌కప్‌ 2024 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ వెల్లడించింది. మెగా టోర్నీలో పాల్గొనే 20 జట్లకు ఓవరాల్‌గా రూ. 93.52 కోట్లను ఐసీసీ పారితోషికంగా పంచనుంది. టోర్నీ విజేతకు ప్రపంచకప్‌ ట్రోఫీతో పాటు రూ. 20.36 కోట్లు.. రన్నరప్‌కు రూ. 10.64 కోట్లు లభించనున్నాయి. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసం రూ. 1.87 కోట్లు లభించనున్నాయి. సెమీస్‌లో ఓడే రెండు జట్లకు చెరి రూ. 6.54 కోట్లు.. సూపర్‌-8లో ఇంటిముఖం పట్టే నాలుగు జట్లకు రూ. 3.17 కోట్లు.. 9, 10, 11, 12 స్థానల్లో నిలిచే జట్లకు రూ. 2.5 కోట్లు.. 13 నుంచి 20 స్థానాల్లో నిలిచే జట్లకు తలో రూ. 1.87 కోట్లు లభించనున్నాయి. ఇదే కాకుండా టోర్నీలో గెలిచే ప్రతి మ్యాచ్‌కు ఆయా జట్టుకు రూ. 25.8 లక్షల రూపాయలు లభించనున్నాయి. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే ఈస్థాయిలో పారితోషికం గతంలో ఎన్నడూ ఇవ్వలేదు. రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌ కేదార్‌ జాదవ్‌, అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

Here's Details

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now