Women’s T20 World Cup 2024: మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ సెమీస్ రేసు నుండి భారత్ ఔట్, 9 ప‌రుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా

హ్యాట్రిక్ విజ‌యాల‌తో జోరుమీదున్న‌ ఆస్ట్రేలియా (Australia)కు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

Harmanpreet Kaur (Photo-BCCI)

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ సెమీస్ రేసులో కీల‌క మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు (TeamIndia) పోరాడి ఇంటి దారి పట్టింది. హ్యాట్రిక్ విజ‌యాల‌తో జోరుమీదున్న‌ ఆస్ట్రేలియా (Australia)కు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. భారీ ఛేద‌న‌లో ఓపెన‌ర్లు ష‌ఫాలీ వ‌ర్మ‌(20), స్మృతి మంధాన‌(6)లు విఫ‌లమైనా.. కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్(54 నాటౌట్) ఆఖ‌రి దాకా పోరాడింది.

ఆసీస్ బౌల‌ర్లను దీటుగా ఎదుర్కొంటూ దీప్తి శ‌ర్మ‌(29)తో 63 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పి జ‌ట్టును గెలుపు దిశ‌గా న‌డిపింది. అయితే.. ఆసీస్ బౌల‌ర్లు పుంజుకొని ఆఖ‌ర్లో వ‌రుస‌గా వికెట్లు తీశారు. దాంతో, టీమిండియాకు ఓట‌మి త‌ప్ప‌లేదు. 9 ప‌రుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా సెమీస్ బెర్తుకు మ‌రింత చేరువైంది.

రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, బంగ్లాదేశ్‌ను అన్ని విభాగాల్లోనూ ఆలౌట్ చేస్తూ ఏకపక్ష విజయం, 2-0తో తిరుగులేని ఆధిక్యం

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)