ICC Men's Player of the Month for June: జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో అవార్డు, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్న భారత స్టార్ పేసర్
జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అతడు సొంతం చేసుకున్నాడు
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2024లో అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తాజాగా మరో అవార్డు దక్కింది. జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అతడు సొంతం చేసుకున్నాడు. ఇక ఈ అవార్డు కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన స్టార్ ప్లేయర్ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా పోటీ పడ్డారు. కానీ, వారిద్దరినీ అధిగమించి బుమ్రా అవార్డు దక్కించుకోవడం విశేషం. టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్, అధికారికంగా ధృవీకరించిన బిసిసిఐ కార్యదర్శి జే షా, ట్వీట్ ఇదిగో..
భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కూడా గ్లోబల్ బాడీ ద్వారా 'ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఎంపిక కావడం భారత్‌కు రెట్టింపు ఆనందం కలిగించింది. గత నెలలో దక్షిణాఫ్రికాపై జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ను క్లీన్ స్వీప్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన మంధాన తన మొదటి ఐసిసి మహిళా ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ను గెలుచుకుంది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)