Namibia Wins Super Over: వీడియో ఇదిగో, ఒమన్ టీంపై నమీబియా సూపర్ విక్టరీ, టీ20 వరల్డ్‌కప్‌లో ఉత్కంఠభరిత విజయాన్ని ఖాతాలో వేసుకున్న నమీబియా
లక్ష్యఛేదనలో ఒమన్ 1 వికెట్ నష్టానికి 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో నమీబియా ఉత్కంఠభరిత విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్-బీలో భాగంగా సోమవారం బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవర్ మైదానం వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. 110 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ఆరంభించిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 109 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా వికెట్ నష్టపోకుండా 21 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్యఛేదనలో ఒమన్ 1 వికెట్ నష్టానికి 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో నమీబియా ఉత్కంఠభరిత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వీడియో ఇదిగో, ఫస్ట్ రెండు బంతులకే ఇద్దర్ని డకౌట్ చేసిన నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్, టీ 20 చరిత్రలో ఇదే తొలిసారి
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)