Kohli Emotional Message: విరాట్ కోహ్లీ ఎమోషనల్ మెసెజ్, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన పరుగుల వీరుడు, పుంజుకుని మరింత బలంగా మళ్లీ మీ ముందుకు వస్తామంటూ ట్వీట్

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్‌లోనే నిష్క్రమించండం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. నమీబియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత జట్టు విజయంతో టోర్నీని ముగించింది. మ్యాచ్ అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో టోర్నీ ఫొటోలను పోస్టు చేసిన కోహ్లీ అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని (Kohli Emotional Message) ఇచ్చాడు.

Virat Kohli (Photo Credits: IANS)

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్‌లోనే నిష్క్రమించండం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. నమీబియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత జట్టు విజయంతో టోర్నీని ముగించింది. మ్యాచ్ అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో టోర్నీ ఫొటోలను పోస్టు చేసిన కోహ్లీ అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని (Kohli Emotional Message) ఇచ్చాడు. మేమందం కలిసి ఒక్కటిగా లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నించాం. దురదృష్టవశాత్తు గమ్యాన్ని చేరుకోలేకపోయాం. మాకంటే ఎక్కువగా ఎవరూ నిరాశ చెంది ఉండరు’’ అని ట్వీట్ చేశాడు. ‘‘మీ నుంచి మాకు అద్భుతమైన మద్దతు లభించింది. అందుకు మేం కృతజ్ఞులం. పుంజుకుని మరింత బలంగా మళ్లీ మీ ముందుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జై హింద్’’ అని కోహ్లీ ఆ పోస్టులో పేర్కొన్నాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement