Noman Ali Takes Hat Trick: విండీస్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీసిన నొమన్ అలీ.. టెస్టుల్లో హాట్రిక్ సాధించిన పాకిస్థాన్ ఐదో బౌల‌ర్‌గా గుర్తింపు, వీడియో ఇదిగో

పాకిస్థాన్ స్టార్ స్పిన్న‌ర్ నొమ‌న్ అలీ చ‌రిత్ర సృష్టించాడు. ముల్తాన్ వేదిక‌గా పాకిస్థాన్, వెస్టిండీస్(PAK vs WI) జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించాడు.

Pakistan spinner Noman Ali takes hat trick against Westindies(X)

పాకిస్థాన్ స్టార్ స్పిన్న‌ర్ నొమ‌న్ అలీ చ‌రిత్ర సృష్టించాడు. ముల్తాన్ వేదిక‌గా పాకిస్థాన్, వెస్టిండీస్(PAK vs WI) జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభ‌ం కాగా టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఇక ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్‌ వేసిన నొమన్ అలీ(Noman Ali) తొలి బంతికి జస్టిన్‌ గ్రీవ్స్‌(1), రెండో బంతికి టెవిన్‌ ఇమ్లాచ్‌(0), మూడో బంతిని కెవిన్‌ సిన్‌క్లెయిర్‌(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. పాకిస్థాన్ త‌రుపున టెస్టుల్లో హాట్రిక్ సాధించిన ఐదో బౌల‌ర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌ 163 పరుగులకు ఆలౌట్ కాగా అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 154 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇక నొమన్ అలీ కంటే ముందు వసీం అక్రమ్(Wasim Akram) రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఆ తర్వాత అబ్దుల్ రజాక్‌, నసీం షాలు హ్యాట్రిక్‌ వికెట్లు తీయగా తాజాగా నొమన్ అలీ ఈ ఫీట్ సాధించాడు.   మరొకసారి చెత్త షాట్ ఆడి ఔటైన రోహిత్ శర్మ, తనను తానే తిట్టకుంటూ చిరాకుగా పెవిలియన్‌లోకి వెళుతున్న వీడియో ఇదిగో..

Pakistan spinner Noman Ali takes hat trick against Westindies

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now