Pakistan Squad for T20I Series: మ‌ళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా బాబర్ ఆజం, 4 ఏళ్ల‌ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పేస‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్‌, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్‌ జట్టు ఇదిగో..

ఈ సిరీస్‌తో బాబ‌ర్ ఆజం మ‌ళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు.రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెనక్కి తీసుకున్న పేస‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్‌ మళ్ళీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

Mohammad Amir

స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ సిరీస్‌తో బాబ‌ర్ ఆజం మ‌ళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు.రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెనక్కి తీసుకున్న పేస‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్‌ మళ్ళీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. మ‌హ్మ‌ద్ అమీర్ పాకిస్తాన్ త‌ర‌పున చివ‌ర‌గా 2020లో ఆడాడు. ఏప్రిల్ 18 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

కివీస్‌తో టీ20ల‌కు పాక్ జ‌ట్టు

బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్ (వికెట్ కీప‌ర్‌), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీప‌ర్‌), మహ్మద్ అమీర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్, ఉస్మాన్ ఖాన్, జమాన్ ఖాన్

నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: హసీబుల్లా, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్ మరియు సల్మాన్ అలీ అఘా

Here's Team

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)