Rahmanullah Gurbaz: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన ఆఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్, 21 ఏళ్ల వయస్సులో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డు

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ రికార్డును గుర్బాజ్ బ్రేక్‌ చేశాడు. సచిన్‌ తన 21 ఏళ్ల వయస్సులో 4 వన్డే సెంచరీలు సాధించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెపర్‌ ‍క్వింటన్‌ డికాక్‌, శ్రీలంక మాజీ ఓపెనర్‌ ఉపుల్‌ తరంగా చెరో 6 సెంచరీలతో అగ్రస్ధానంలో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.

Rahmanullah Gurbaz (Photo-Twitter)

ఆఫ్గానిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్ 21 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. హంబన్‌టోటా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన గుర్బాజ్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించకున్నాడు. ఇప్పటివరకు వన్డేల్లో గుర్బాజ్‌ 5 సెంచరీలు సాధించాడు.

ఈ క్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ రికార్డును గుర్బాజ్ బ్రేక్‌ చేశాడు. సచిన్‌ తన 21 ఏళ్ల వయస్సులో 4 వన్డే సెంచరీలు సాధించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెపర్‌ ‍క్వింటన్‌ డికాక్‌, శ్రీలంక మాజీ ఓపెనర్‌ ఉపుల్‌ తరంగా చెరో 6 సెంచరీలతో అగ్రస్ధానంలో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.

అదే విధంగా మరో అరుదైన ఘనతను కూడా గుర్భాజ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 5 సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా గుర్భాజ్‌ రికార్డులకెక్కాడు. గుర్బాజ్‌ కేవలం 23 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో బాబర్‌ ఆజం రికార్డును గుర్బాజ్‌ బ్రే​క్‌ చేశాడు. బాబర్‌ 25 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేసిన లిస్ట్‌లో క్వింటన్‌ డికాక్‌(13 ఇన్నింగ్స్‌లు), పాక్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(13 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్ధానాల్లో కొనసాగుతున్నారు.

Rahmanullah Gurbaz (Photo-Twitter)

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now