ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024, గోల్డెన్ ట్రోఫీతో రోహిత్ శర్మ, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
టీ20 ప్రపంచ కప్ టోర్నీకోసం అమెరికా వెళ్లిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బాస్కెట్ బాల్ ట్రోఫీతో కెమెరా కంటపడ్డాడు. శుక్రవారం న్యూయార్క్‌లోని నస్సావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి హిట్‌మ్యాన్ వెళ్లాడు. ఒక టేబుల్ మీద టీ20 వరల్డ్ కప్.. ఆ పక్కనే ఎన్‌బీఏ (NBA) విజేతలకు ఇచ్చే లారీ ఒ బ్రియెన్ ట్రోఫీ(Larry O’Brein Trophy)ని అతడు చూశాడు.
టీ20 ప్రపంచ కప్ టోర్నీకోసం అమెరికా వెళ్లిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బాస్కెట్ బాల్ ట్రోఫీతో కెమెరా కంటపడ్డాడు. శుక్రవారం న్యూయార్క్‌లోని నస్సావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి హిట్‌మ్యాన్ వెళ్లాడు. ఒక టేబుల్ మీద టీ20 వరల్డ్ కప్.. ఆ పక్కనే ఎన్‌బీఏ (NBA) విజేతలకు ఇచ్చే లారీ ఒ బ్రియెన్ ట్రోఫీ(Larry O’Brein Trophy)ని అతడు చూశాడు. బంగారు వర్ణంలో ధగధగ మెరిసిపోతున్న ఆ కప్పును చేతుల్లోకి తీసుకొని ఫొటోలకు పోజిచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. అనంతరం ”మీ అభిమాన బాస్కెట్ బాల్ ఆటగాడు ఎవరు?’ అనే ప్రశ్నకు రోహిత్.. ‘మైఖేల్ జోర్డాన్'(Michael Zordan) అని బదులిచ్చాడు. ‘చికాగో బుల్స్’ (Chicago Bulls) జట్టు తరపున జోర్డాన్ ఆడిన తీరు చూసి తాను స్ఫూర్తి పొందానని తెలిపాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)