Ruben Trumpelmann: వీడియో ఇదిగో, ఫస్ట్ రెండు బంతులకే ఇద్దర్ని డకౌట్ చేసిన నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్, టీ 20 చరిత్రలో ఇదే తొలిసారి

బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ మైదానం వేదికగా ఒమన్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే ఇద్దరినీ గోల్డెన్ డకౌట్‌ చేశాడు.

Namibia's Ruben Trumpelmann

వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్-2024లో నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్ టీ20 క్రికెట్‌లో ఇదివరకు ఎప్పుడూ ఎరుగని సరికొత్త రికార్డును సృష్టించాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ మైదానం వేదికగా ఒమన్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే ఇద్దరినీ గోల్డెన్ డకౌట్‌ చేశాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్‌ను ఇన్నింగ్స్ ఆరంభంలోనే తొలి 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. తొలి బంతికి ఓపెనర్ ప్రజాపతి, ఆ మరుసటి బంతికి కెప్టెన్ అకిబ్ ఇలియాస్‌‌లను పెవీలియన్‌కు పంపించాడు. ఇద్దరినీ గోల్డెన్ డకౌట్‌ చేశాడు. ఈ విధంగా టీ20 క్రికెట్‌లో ఇన్నింగ్స్ ఆరంభ తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన మొట్టమొదటి ఆటగాడిగా రూబెన్ ట్రంపెల్‌మాన్ నిలిచాడు. 2,633 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఈ విధంగా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఫస్ట్ రెండు బంతులకే ఇద్దరినీ గోల్డెన్ డకౌట్‌గా పంపాడు, టీ20 చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్

Here's Video

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif