Saurabh Tiwary Retires: ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్, టీమిండియా తరపున, ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సౌరభ్ తివారి రికార్డు ఇదిగో..
ప్రస్తుత రంజీ సీజన్‌లో తన జట్టు ప్రస్తానం ముగిసిన అనంతరం 34 ఏళ్ల తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని జంషెడ్‌పూర్‌లో వెల్లడించాడు.
జార్ఖండ్ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ సౌరభ్ తివారి ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో తన జట్టు ప్రస్తానం ముగిసిన అనంతరం 34 ఏళ్ల తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని జంషెడ్‌పూర్‌లో వెల్లడించాడు. దాదాపు 17 ఏళ్ల పాటు జార్ఖండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తివారి.. టీమిండియా తరఫున, ఐపీఎల్‌లో పలు మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన తివారి.. ఐపీఎల్‌లో నాలుగు ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచ్‌లు ఆడాడు.
2010 ఐపీఎల్ సీజన్‌లో తివారి ముంబై ఇండియన్స్ తరఫున 419 పరుగులు చేశాడు.భారత్ తరఫున అతను ఆడిన 3 మ్యాచ్‌ల్లో 49 పరుగులు చేశాడు.జార్ఖండ్ తరఫున 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 22 సెంచరీల సాయంతో 8030 పరుగులు చేశాడు. కోహ్లి నేతృత్వంలోని అండర్-19 ప్రపంచకప్ (2008) గెలిచిన భారత యువ జట్టులో తివారి సభ్యుడు కావడం మరో విశేషం.ఆర్సీబీ 2011 సీజన్ కోసం భారీ మొత్తం వెచ్చించి తివారీని కొనుగోలు చేసింది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)