Shah Rukh Khan Kisses Gautam Gambhir: వీడియో ఇదిగో, గౌతం గంభీర్‌కు ముద్దు పెట్టిన షారుఖ్ ఖాన్, పదేళ్ల తరువాత ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన కోల్‌కతా
గౌతం గంభీర్ నుదుటిపై ముద్దు పెట్టి కౌగిలించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను గౌతీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'డేర్ టూ డ్రీమ్' అనే క్యాప్షన్ తో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరోవైపు గౌతీకి షారుఖ్ ముద్దు పెట్టిన వీడియోను అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.
Shah Rukh Khan Kisses Gautam Gambhir Video: 2024 ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి టైటిల్ గెలిచింది. దీంతో దాదాపు పదేళ్ల తర్వాత ట్రోఫీ నెగ్గడంతో కోల్‌కతా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నైట్ రైడర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.నిన్నటి ఫైనల్ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం తర్వాత ఫ్రాంచైజీ కో-ఓనర్ షారుఖ్ ఖాన్ జట్టు ఆటగాళ్లను, సిబ్బందిని అభినందించారు.
ఈ క్రమంలో మెంటార్ గౌతం గంభీర్ నుదుటిపై ముద్దు పెట్టి కౌగిలించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను గౌతీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'డేర్ టూ డ్రీమ్' అనే క్యాప్షన్ తో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరోవైపు గౌతీకి షారుఖ్ ముద్దు పెట్టిన వీడియోను అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.
Here's Video and Pics