SRH Blocks David Warner: డేవిడ్‌ వార్నర్‌ను మరోసారి ఘోరంగా అవమానించిన సన్‌ రైజర్స్‌, అతని ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలు బ్లాక్‌

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏకైక ఐపీఎల్‌ ట్రోఫీని అందించిన డేవిడ్‌ వార్నర్‌ను సన్‌ రైజర్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలలో బ్లాక్‌ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా వార్నరే స్క్రీన్‌ షాట్స్‌ తీసి మరీ వెల్లడించాడు.

David Warner (Photo credit: Twitter)

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏకైక ఐపీఎల్‌ ట్రోఫీని అందించిన డేవిడ్‌ వార్నర్‌ను సన్‌ రైజర్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలలో బ్లాక్‌ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా వార్నరే స్క్రీన్‌ షాట్స్‌ తీసి మరీ వెల్లడించాడు. సన్‌ రైజర్స్‌ తనను బ్లాక్‌ చేసిందని స్క్రీన్‌ షాట్స్‌ షేర్‌ చేస్తూ.. ‘ట్రావిస్‌ హెడ్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ను రీపోస్ట్‌ చేయాలని ప్రయత్నించాను. కానీ సన్‌ రైజర్స్‌ నన్ను బ్లాక్‌ చేసింది.. ’అని ఎక్స్‌ (ట్విటర్‌)లో రాసుకొచ్చాడు. వార్నర్‌ ఈ పోస్టు చేసిన వెంటనే అతడి అభిమానులు హైదరాబాద్‌ ఫ్రాంచైజీపై దుమ్మెత్తిపోస్తున్నారు.

కాగా ఐపీఎల్‌ మినీ వేలం – 2024 సందర్భంగా ఆసీస్‌ సూపర్‌ స్టార్స్‌ పాట్‌ కమిన్స్‌, ట్రావిస్‌ హెడ్‌లు భారీ ధర దక్కించుకున్న విషయం తెలిసిందే. కమిన్స్‌కు రూ. 20.50 కోట్లు వెచ్చించిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ట్రావిస్‌ హెడ్‌కు రూ. 6.8 కోట్లు దక్కాయి. ఈ ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పేందుకు గాను వార్నర్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాలని చూశాడు. కానీ సన్‌ రైజర్స్‌ మాత్రం వార్నర్‌ను బ్లాక్‌ చేసింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement