Labuschagne Diving Catch Video: పక్షిలా గాల్లో ఎగురుతూ మార్నస్‌ లబుషేన్‌ కళ్లు చెదిరే క్యాచ్ వీడియో ఇదిగో, ఒక్కసారిగా షాక్ అయిన విండీస్ బ్యాటర్ కార్టీ

బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌కు కొంచెం వైడ్‌గా ఉన్న లబుషేన్‌.. పక్షిలా గాల్లో ఎగురుతూ మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Marnus Labuschagne Diving Catch Video

కాన్‌బెర్రా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో వెస్టిండీస్‌ బ్యాటర్‌ కార్టీని పెవిలియన్‌కు పంపాడు.విండీస్‌ ఇన్నింగ్స్‌ 11 ఓవర్‌ వేసిన లాన్స్‌ మోరిస్‌ బౌలింగ్‌లో మూడో బంతిని కార్టీ.. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు.ఈ క్రమంలో బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌కు కొంచెం వైడ్‌గా ఉన్న లబుషేన్‌.. పక్షిలా గాల్లో ఎగురుతూ మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ మ్యాచ్ లో విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారులు క్లీన్‌ స్వీప్‌ చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now