Rohit Sharma Sixes Video: వీడియో ఇదిగో, ఆస్ట్రేలియా బౌలర్లకు సిక్సర్లతో చుక్కలు చూపించిన రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ సూపర్-8 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా హిట్‌మ్యాన్ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. డారెన్ సామీ క్రికెట్ స్టేడియం రోహిత్ సిక్సర్ల వర్షంతో తడిసి ముద్ద అయింది. సరిగ్గా 17 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రోహిత్ తృటిలో తన ఆరో టీ20 సెంచరీని చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
రోహిత్ సెంచరీ చేయకపోయినప్పటకి తన బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను మాత్రం ఖుషీ చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్లో ఓడించారన్న కసిని ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ చూపించేశాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. శెభాష్ హిట్‌మ్యాన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)