Rishabh Pant: టీమిండియా జెర్సీ వేసుకోగానే భావోద్వేగానికి గురైన రిషభ్ పంత్, భగవంతుడా నీకు ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్
టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టులో చోటు సంపాదించుకున్న సంగతి విదితమే. 16 నెలల తర్వాత టీమిండియా జెర్సీ వేసుకున్న పంత్ ఆ దేవుడికి ధన్యవాదాలు తెలిపాడు.
భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) 16 నెలల తర్వాత మళ్లీ టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టులో చోటు సంపాదించుకున్న సంగతి విదితమే. 16 నెలల తర్వాత టీమిండియా జెర్సీ వేసుకున్న పంత్ ఆ దేవుడికి ధన్యవాదాలు తెలిపాడు. వరల్డ్ కప్ జెర్సీ వేసుకున్న సంతోషంలో పంత్ దైవాన్ని గుర్తు చేసుకున్నాడు. తన మనసులోని మాటల్ని వ్యక్తపరుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ డాషింగ్ బ్యాటర్ ఓ పోస్ట్ పెట్టాడు. T20 ప్రపంచ కప్ 2024 పూర్తి షెడ్యూల్ ఇదిగో, ఆన్‌లైన్‌లో ఉచిత PDF డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
పంత్ తన పోస్ట్‌లో పేసర్లు బుమ్రా, సిరాజ్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌లతో దిగిన ఫొటోల్ని పెట్టాడు. ‘భగవంతుడా నీకు ధన్యవాదాలు. ఈ జెర్సీ వేసుకోన్నందుకు నా మనసంతో కృతజ్ఞతా భావం, సంతోషం, గర్వంతో నిండిపోయింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప ఫీలింగ్ ఇంకేముంటుంది’ అని పంత్ తన పోస్ట్‌కు క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)