Uganda Squad for ICC T20 World Cup 2024: నలభై మూడేళ్ల వయసులో పొట్టి ప్రపంచకప్‌లోకి, టీ20 వరల్డ్‌కప్‌కి ఉగాండా స్క్వాడ్‌ ఇదిగో..

మ‌రో 25 రోజుల్లో టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న టీ20 వరల్డ్ కప్-2024కు అన్ని జట్లు తమ స్క్వాడ్లను ప్రకటించాయి.తాజాగా ఉగాండా కూడా 15 మందితో కూడిన తమ జట్టును ప్ర‌క‌టించింది.

Uganda Squad for ICC T20 World Cup 2024

మ‌రో 25 రోజుల్లో టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న టీ20 వరల్డ్ కప్-2024కు అన్ని జట్లు తమ స్క్వాడ్లను ప్రకటించాయి.తాజాగా ఉగాండా కూడా 15 మందితో కూడిన తమ జట్టును ప్ర‌క‌టించింది. ఈ సందర్భంగా అత్యంత పెద్ద వయసులో టీ20 ప్ర‌పంచ‌ కప్ లో ఆడబోతున్న ప్లేయర్ గా ఉగాండా ఆఫ్ స్పిన్నర్‌ ఫ్రాంక్‌ సుబుగా నిలవనున్నాడు.

తొలిసారి ఈ మెగా టోర్నీలో బ్రయాన్‌ మసాబా సార‌థ్యంలో ఉగాండా బ‌రిలోకి దిగ‌నుంది. కాగా, ఆఫ్రికా క్వాలిఫయర్స్‌ రీజనల్‌లో ఫైనల్‌లో ఉగాండా రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ప్ర‌పంచ‌ కప్ కు అర్హత సాధించ‌డం జ‌రిగింది. గ్రూప్‌-సీలో ఉన్న ఈ జట్టు తన మొదటి మ్యాచ్‌ను జూన్‌ 3న ఆఫ్గనిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ఉగాండా స్క్వాడ్‌: బ్రయాన్‌ మసాబా, కెన్నెత్‌ వైస్వా, రిజాత్‌ అలీ షా, ఫ్రాంక్‌ సుబుగా, దినేశ్‌ నక్రాని, రోజర్‌ ముకాసా, రోనక్‌ పటేల్‌, బిలాల్‌ హసున్‌, కోస్మాస్‌ క్యెవుటా, రాబిన్సన్‌ ఒబుయా, ఫ్రెడ్‌ అచెలమ్‌, హెన్నీ సెన్యోండో, సిమోన్‌ సెసాజి, జుమా మియాజి. అల్పేష్‌ రాజ్‌మణి.

Here's Team

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now