Virat Kohli: వైరల్ వీడియో, అనుష్కతో వీడియో కాల్‌లో ఉన్నా, నన్ను డిస్ట్రబ్ చేయకండి, అభిమానులకు వీడియో కాల్‌ చూపించిన కోహ్లీ, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌ విజయం అనంతరం రాత్రి తిరువనంతపురం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు టీమిండియా బృందం బస్సులో బయలుదేరింది. కోహ్లిని చూడగానే అభిమానుల్లో మరింత జోష్‌ వచ్చింది.

Virat Kohli (Photo Credits: IANS)

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌ విజయం అనంతరం రాత్రి తిరువనంతపురం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు టీమిండియా బృందం బస్సులో బయలుదేరింది. కోహ్లిని చూడగానే అభిమానుల్లో మరింత జోష్‌ వచ్చింది. కోహ్లి.. కోహ్లి'' అంటూ గట్టి గట్టిగా అరిచారు. అయితే ఆ సమయంలో కోహ్లి.. తన భార్య అనుష్క శర్మతో ఫోన్‌లో వీడియో కాల్‌లో ఉన్నాడు. అభిమానుల పిలుపుకు స్పందించిన కోహ్లి వెంటనే బస్సు అద్దంలో నుంచి.. ''అనుష్కతో వీడియో కాల్‌లో ఉన్నా.. డిస్టర్బ్‌ చేయకండి'' అంటూ ఫోన్‌ చూపిస్తూ నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement