Yuzvendra Chahal: ఆ తాగుబోతు 15వ అంతస్తు నుంచి నన్ను వేలాడదీశాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్
టీంమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. తనపై జరిగిన హత్యాయత్నాన్ని, ఒళ్లు గగుర్పొడిచే ఘటన గురించి వెల్లడించాడు. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో ‘ఆ తాగుబోతు ఆటగాడు’ తథేకంగా తనవైపే చూశాడని, తనను రమ్మని పిలిచి హోటల్ 15వ అంతస్తు నుంచి తనను వేలాడేశాడని చెప్పాడు.
టీంమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. తనపై జరిగిన హత్యాయత్నాన్ని, ఒళ్లు గగుర్పొడిచే ఘటన గురించి వెల్లడించాడు. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో ‘ఆ తాగుబోతు ఆటగాడు’ తథేకంగా తనవైపే చూశాడని, తనను రమ్మని పిలిచి హోటల్ 15వ అంతస్తు నుంచి తనను వేలాడేశాడని చెప్పాడు. చంపినంత పనిచేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.నేను 2013లో ముంబై తరఫున ఆడుతున్నాను. బెంగళూరులో మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అయ్యాక గెట్ టు గెదర్ పార్టీ జరిగింది.
అక్కడ ఓ ఆటగాడు బాగా తాగి ఉన్నాడు. అతడి పేరు నేను చెప్పదలచుకోలేదు. ఆ తాగుబోతు ఆటగాడు నన్ను పిలిచి బయటకు తీసుకెళ్లాడు. నన్ను ఎత్తుకుని 15వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడదీశాడు. నాకు ఒక్కసారిగా భయమేసింది. అతడి మెడ చుట్టూ నేను చేతులు బిగించి పట్టుకున్నాను. చేతులు జారాయా.. నేను చచ్చినట్టే. దీంతో అక్కడున్న ఇతర ఆటగాళ్లు వచ్చి నన్ను పైకి లాగారు. కళ్లు తిరిగి పడిపోయిన నాకు కొన్ని నీళ్లిచ్చారు. దీంతో కొద్దిలో చావును తప్పించుకున్నాను. ఆటగాళ్లు నన్ను రూమ్ కు తీసుకెళ్లారు’’ అని చాహల్ వివరించాడు.