Ronaldo's Boy Dies: తీవ్ర విషాదం, ఫుట్‌బాల్‌ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కుమారుడు మృతి, తమ జీవితాల్లో అత్యంత విషాదకరమైన రోజు అంటూ భావోద్వేగానికి గురైన దంపతులు

మాంచెస్ట‌ర్ యునైటెడ్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్, ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ఆటగాడు, పోర్చుగల్‌ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జార్జినా రోడ్రిగేజ్‌, రోనాల్డో దంప‌తుల‌కు పుట్టిన కుమారుడు మృతిచెందిన‌ట్లు సోష‌ల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు.

Cristiano Ronaldo (Photo credit: Twitter)

మాంచెస్ట‌ర్ యునైటెడ్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్, ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ఆటగాడు, పోర్చుగల్‌ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జార్జినా రోడ్రిగేజ్‌, రోనాల్డో దంప‌తుల‌కు పుట్టిన కుమారుడు మృతిచెందిన‌ట్లు సోష‌ల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు. తమ జీవితాల్లో అత్యంత విషాదకరమైన రోజు అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.రోనాల్డో, రోడ్రిగేజ్ దంపతులకు క‌వ‌ల పిల్ల‌లు క‌లిగారు.

అయితే ఆ క‌వ‌ల‌ల్లో అమ్మాయి ప్రాణాల‌తో ఉండ‌గా, అబ్బాయి మ‌ర‌ణించిన‌ట్లు రోనాల్డో ఇన్‌స్టా పోస్టులో తెలిపారు. అమ్మాయి ప్రాణాల‌తో ఉండ‌డం త‌మ‌కు ఆశ‌ను, సంతోషాన్ని ఇస్తున్న‌ట్లు చెప్పారు. అబ్బాయిని కోల్పోతే త‌ల్లితండ్రుల‌కు ఎంత వేద‌న ఉంటుందో తెలుస‌న్నారు. అక్టోబ‌ర్‌లో ప్రెగ్నెన్సీ అయిన‌ట్లు ఆ జంట ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మాంచెస్ట‌ర్ యునైటెడ్ యాజ‌మాన్యంతో పాటు జ‌ట్టు స‌భ్యులు రోనాల్డ్ ఇంట జ‌రిగిన విషాదం ప‌ట్ల స్పందిస్తూ నివాళి అర్పించారు. రోనాల్డోకు క్రిస్టియానో జూనియ‌ర్ అనే కుమారుడు ఉన్నాడు. అత‌ను 2010లో పుట్టాడు. 2017లో ఈవా, మాటియో క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. 2017లో రోడ్రిగేజ్‌కు అలానా మార్టినా అనే కుమార్తె కూడా పుట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Cristiano Ronaldo (@cristiano)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now