Mexico: స్టేడియంలో రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు, గొడవలో 22 మందికి గాయాలు, 13 మంది పరిస్థితి విషమం, క్వెరెటారో, అట్లాజ్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఘటన
మెక్సికోలోని లా కొర్రెగిడోరా స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. క్వెరెటారో, అట్లాజ్ జట్ల మధ్య శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల అభిమానులు భీకరమైన ముష్టి యుద్ధానికి దిగారు.
మెక్సికోలోని లా కొర్రెగిడోరా స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. క్వెరెటారో, అట్లాజ్ జట్ల మధ్య శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల అభిమానులు భీకరమైన ముష్టి యుద్ధానికి దిగారు. మ్యాచ్ ప్రారంభంమైన కొద్ది నిమిషాలకే ఇరు జట్ల అభిమానులు దాడులకు దిగడంతో స్టేడియంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. కుర్చీలు, పిడిగుద్దులతో అభిమానులు ఒకరిపై ఒకరు విచక్షణారాహిత్యంగా విరుచుకుపడ్డారు.
ఈ గొడవలో 22 మంది గాయపడగా, 13 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన వారి సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇరు జట్ల అభిమానుల మధ్య మొదలైన చిన్న గొడవ తన్నులాటకు దారితీసిందని తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య( ఫిఫా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్టేడియం నిర్వాహకులకు ఆదేశించింది.