YSRCP vs TDP: దమ్ముంటే, మగాళ్లయితే ఇప్పుడు రండి అంటూ చంద్రబాబు సవాల్, సీఎం జగన్, డీజీపీ వచ్చినా సరే అని ఛాలెంజ్, అన్నా క్యాంటీన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పం బస్టాండ్ వద్ద చంద్రబాబు ప్రారంభించాల్సి ఉన్న అన్నా క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పం బస్టాండ్ వద్ద చంద్రబాబు ప్రారంభించాల్సి ఉన్న అన్నా క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోయాయి.అన్నా క్యాంటీన్ ఎదురుగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా 'సీఎం జగన్ డౌన్ డౌన్' అంటూ టీడీపీ కార్యకర్తలు నినదించారు.
మరోవైపు చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పై, వైసీపీ కార్యకర్తలపై మండిపడ్డారు. దమ్ముంటే, మగాళ్లయితే ఇప్పుడు రావాలని సవాల్ విసిరారు. దమ్ముంటే సీఎం జగన్, డీజీపీ వచ్చినా సరే అని ఛాలెంజ్ చేశారు. జగన్ కు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని అన్నారు. జగన్ రెడ్డి చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా మారారని మండిపడ్డారు. కుప్పం చరిత్రలో ఇదొక చీకటి రోజని అన్నారు. ఇలాంటి దారుణాలు కుప్పంలో గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)