Andhra Pradesh: విద్యార్థులకు కరెంట్‌ షాక్‌ ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి, మృతిచెందిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం

విద్యార్థులకు కరెంట్‌ షాక్‌ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి శుక్రవారం ఆయన రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

AP CM YS Jaganmohan Reddy | File Photo

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం దొంతికుర్రు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు క్షేమంగా ఉన్నారు. ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది

విద్యార్థులకు కరెంట్‌ షాక్‌ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి శుక్రవారం ఆయన రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement