IPL Auction 2025 Live

Andhra Pradesh: రూ.3,19,480 కోట్లతో ఏపీ వార్షిక రుణ ప్ర‌ణాళిక ఖ‌రారు, వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు, ప్రాథమిక రంగానికి రూ. 2,35,680 కోట్లు, మిగిలిన మొత్తం ఇత‌ర రంగాల‌కు కేటాయింపు

ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించ‌గా... కేవ‌లం ప్రాథమిక రంగానికి మాత్ర‌మే రూ. 2,35,680 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణ‌యించారు. మిగిలిన మొత్తాన్ని ఇత‌ర రంగాల‌కు కేటాయించారు.

AP CM YS Jagan (Photo-Twitter)

ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం (2022-23)కు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్షిక రుణ ప్ర‌ణాళిక ఖ‌రారైంది. ఈ మేర‌కు గురువారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్రస్థాయి బ్యాంక‌ర్ల స‌మావేశం (ఎస్ఎల్‌బీసీ) ఈ రుణ ప్ర‌ణాళిక‌ను ఖ‌రారు చేసింది. ఈ స‌మావేశానికి రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి హాజ‌రు కాగా...రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి మాత్రం గైర్హాజ‌ర‌య్యారు.

ఏపీ వార్షిక రుణ ప్రణాళిక మొత్తం విలువ‌ను రూ.3,19,480 కోట్లుగా ఖ‌రారు చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించ‌గా... కేవ‌లం ప్రాథమిక రంగానికి మాత్ర‌మే రూ. 2,35,680 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణ‌యించారు. మిగిలిన మొత్తాన్ని ఇత‌ర రంగాల‌కు కేటాయించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)