Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, దమ్ముంటే నాపై పోటీ చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరిన కేశినేని నాని, 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా

టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani VS Chandrababu) మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో (Andhra Pradesh Elections 2024) విజయవాడ నుంచి చంద్రబాబు పోటీ చేసినా గెలవరని చెప్పారు. చంద్రబాబుపై తాను మూడు లక్షల మెజారిటీతో గెలుస్తానని ప్రకటించారు.

Kesineni Nani VS Chandrababu (Photo-Facebook)

టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani VS Chandrababu) మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో (Andhra Pradesh Elections 2024) విజయవాడ నుంచి చంద్రబాబు పోటీ చేసినా గెలవరని చెప్పారు. చంద్రబాబుపై తాను మూడు లక్షల మెజారిటీతో గెలుస్తానని ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల మ్యాంగో మార్కెట్‌లో ఆదివారం నిర్వహించిన నందిగామ వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీలోంచి మెడపట్టుకుని బయటకు గెంటేశారని అన్నారు. తాను ఢిల్లీ స్థాయి వ్యక్తినన్న కేశినేని నాని..ఎన్నికల్లో ఓడిపోయిన లోకేశ్ స్థాయి ఎంత అని మండిపడ్డారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చివరివని జోస్యం చెప్పారు.చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమన్నారు. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అయితే, పేదలకు వ్యతిరేకంగా పాలన చేసిన ఘనుడు నారా చంద్రబాబునాయుడని అన్నారు.రేపు రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయాక మూటే ముళ్లే సర్దుకొని హైదరాబాద్‌కు వెళ్లడం ఖాయమన్నారు.ఆస్తులు అమ్ముకొని, అవమానాలు పడి పార్టీని కాపాడుకున్నానని.. అయినా అక్కడ విలువ లేదని అన్నారు. తనను ఆలింగనం చేసుకొని మీలాంటి వ్యక్తులు తమ పార్టీలో ఉండాలని జగన్ ఆహ్వానించారని భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. జగన్ నిజమైన అంబేద్కర్ వాది అని కొనియాడారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now