Andhra Pradesh: శభాష్ పోలీస్, బాపట్ల బీచులో సముద్ర స్నానం చేస్తూ మునిగిపోయిన యువతుల ప్రాణాలను కాపాడిన ఏపీ పోలీసులు..
బాపట్ల బీచ్ లో కార్తీకమాసం సందర్భంగా సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చి, సముద్రపు నీటిలో మునిగిపోయి గల్లంతవుతున్న ఇద్దరు యువతులను పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో కాపాడారు.
బాపట్ల బీచ్ లో కార్తీకమాసం సందర్భంగా సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చి, సముద్రపు నీటిలో మునిగిపోయి గల్లంతవుతున్న ఇద్దరు యువతులను పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువతులు ఇరువురు కార్తీక మాసం చివరి రోజున సముద్ర స్నానం ఆచరించేందుకు నీటిలోకి దిగారు. ఇంతలో అలల ధాటికి ఇరువురు గల్లంతయ్యారు. దీన్ని గుర్తించిన స్థానికులు వారిని కాపాడి, తీరానికి తీసుకురాగా, పోలీసులు సీపీఆర్ నిర్వహించి యువతుల ప్రాణాలను కాపాడారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)