YS Jagan: వీడియో ఇదిగో, ఎవరొచ్చినా వైసీపీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు, వచ్చే 30 ఏళ్లు మనదే అధికారం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విజయవాడ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. ‘ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు
విజయవాడ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. ‘ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుంది’’ అంటూ వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను.
వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైసీపీ బతుకుందని, రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు ఏలుతుందని ఆ పార్టీ అధినేత YS జగన్ అన్నారు. ఎవరూ పార్టీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరని చెప్పారు.
వచ్చే 30 ఏళ్లు మనదే అధికారం, కార్యకర్తలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)