COVID in AP: ఏపీలో కొత్తగా 4,570 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కొత్త కేసులు నమోదు
4,570 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 1,028 కేసులు, గుంటూరు జిల్లాలో 368, అనంతపురం జిల్లాలో 347 కేసులు వెల్లడయ్యాయి.
ఏపీలోరాష్ట్రంలో గడచిన 24 గంటల వ్యవధిలో 30,022 శాంపిల్స్ పరీక్షించగా... 4,570 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 1,028 కేసులు, గుంటూరు జిల్లాలో 368, అనంతపురం జిల్లాలో 347 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 669 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,06,280 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,65,000 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 26,770 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,510కి పెరిగింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)