Neeraj Chopra: ప్ర‌పంచ అథ్లెటిక్స్ లో సత్తా చాటిన నీరజ్ చోప్రా, భార‌త అథ్లెట్ నీర‌జ్ చోప్రాకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్

ఒలింపిక్ ఛాంపియ‌న్‌,భార‌త అథ్లెట్ నీర‌జ్ చోప్రా మ‌రోసారి భార‌త జాతి గ‌ర్వ‌ప‌డేలా చేశాడు. ప్ర‌పంచ అథ్లెటిక్స్ జావెలిన్ త్రో ఫైన‌ల్లో….రెండో స్థానంలో నిలిచి ర‌జ‌త ప‌త‌కం సొంతం చేసుకున్నాడు.

AP CM YS Jagan (Photo-Twitter)

ఒలింపిక్ ఛాంపియ‌న్‌,భార‌త అథ్లెట్ నీర‌జ్ చోప్రా మ‌రోసారి భార‌త జాతి గ‌ర్వ‌ప‌డేలా చేశాడు. ప్ర‌పంచ అథ్లెటిక్స్ జావెలిన్ త్రో ఫైన‌ల్లో….రెండో స్థానంలో నిలిచి ర‌జ‌త ప‌త‌కం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్​గా నిలిచాడు నీరజ్​ చోప్రా. అంతకుముందు 2003లో పారిస్​ వేదికగా జరిగిన వరల్డ్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో లాంగ్​ జంప్​ విభాగంలో కాంస్యం గెల్చుకుంది అంజు బాబి జార్జ్​. ఇప్పుడు నీరజ్​ ఆమె కంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement