TTD New Chairman: టీటీడీ నూతన చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి నియామకం..

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం వారం రోజుల్లో ముగియనుండడంతో TTD చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు.

Bhumana Karunakara Reddy as the new Chairman of TTD

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం వారం రోజుల్లో ముగియనుండడంతో TTD చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. టీటీడీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన.. గతంలో దివంగత వైఎస్ఆర్ హయాంలో భూమన 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. తాజా నియామకంతో ఆయన రెండేళ్లపాటు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి 2019లో ఆ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం టీటీడీలో చైర్మన్‌తో పాటు 35 మంది పాలకవర్గ సభ్యులు ఉన్నారు.

Bhumana Karunakara Reddy as the new Chairman of TTD

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now