Kiran Royal Case: వీడియో ఇదిగో, జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో ట్విస్ట్, కాంప్రమైజ్‌కు రావాలని పవన్ కళ్యాణ్ ఆఫీసు నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపిన లక్ష్మీ
జనసేన నేత కిరణ్ రాయల్(Kiran Royal) తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటానని బాధితురాలు లక్ష్మి(Laxmi) అంటున్నారు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేసిన ఆమె.. కాంప్రమైజ్‌కు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు
జనసేన నేత కిరణ్ రాయల్(Kiran Royal) తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటానని బాధితురాలు లక్ష్మి(Laxmi) అంటున్నారు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేసిన ఆమె.. కాంప్రమైజ్‌కు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. కిరణ్ రాయల్‌తో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. స్థానిక సీఐ నాకు సెటిల్‌మెంట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. మొదటి నుంచి చెబుతున్నట్లు నాకు ఈ పోరాటంలో ఏ పార్టీ మద్దతు లేదు. నా ఆరోగ్యం బాగోలేకున్నా.. నా పిల్లలు వద్దని చెప్పినా.న్యాయ పోరాటం చేస్తున్నా. నన్ను రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అయినా నా పోరాటం ఆపను.విజయవాడ వచ్చి కలవాలని పవన్ కల్యాణ్(Pawan Kalyan) పీఏ దగ్గరి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. కానీ, నా పిల్లల భవిష్యత్ కోసం నేను వెళ్లవద్దని అనుకుంటున్న అని లక్ష్మి తెలిపారు.
Kiran Royal Victim Lakshmi Press Meet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)