Chandrababu Naidu Eye Operation: చంద్రబాబుకు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో క్యాటరాక్ట్ ఆపరేషన్ పూర్తి..ఫోటోలు వైరల్..

ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు.

(PIC@ X)

టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో మంగళవారం శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల సేపు కొనసాగింది. శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి బయల్దేరారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టిడిపి ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల టిడిపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో చంద్రబాబు ఎడమ కంటికి సర్జరీ చేయించుకున్నారు. ఈ మేరకు ఇవాళ ( నవంబర్ 7) కుడి కంటికి శస్త్ర చికిత్స జరిగింది.

(PIC@ X)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)